
వక్ఫ్ భూముల వేలంపై హైకోర్టు స్టే
పాలకవీడు: పాలకవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని జాన్‌పహాడ్ దర్గా భూముల కౌలు వేలంపాటను తాత్కాలికంగా రద్దు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. బుధవారం పాలకవీడులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాన్‌పహాడ్ దర్గాకు సంబంధించి వక్ఫ్‌కు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 57 ఎకరాల 38 గుంటల భూములపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం వేలం నిర్వహించాల్సి ఉందని అయితే ఈ భూములు తమకే చెందుతాయని హక్కుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించినట్లు చెప్పారు. ఇప్పటికే దర్గాపై తమకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిందని హక్కుదారులు తెలిపారు.
మెప్మా పీడీగా
బాధ్యతల స్వీకరణ
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డి బుధవారం మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించారు. హన్మంతరెడ్డికి మెప్మాపీడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమస్యల
పరిష్కారానికి పోరుబాట
మునగాల: ప్రజాసమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ సభ్యుడు చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, షేక్ సైదా, బచ్చలకూరి స్వరాజ్యం, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, వి.వెంకన్న,బోళ్ల కృష్ణారెడ్డి, గోపయ్య, నాగయ్య, వెంకటాద్రి, నరసయ్య, వెంకటకోటమ్మ, జ్యోతి, సతీష్ పాల్గొన్నారు.

వక్ఫ్ భూముల వేలంపై హైకోర్టు స్టే