ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే.. | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..

Aug 7 2025 11:01 AM | Updated on Aug 7 2025 11:01 AM

ఎస్‌జ

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..

త్వరలో పోటీలను ప్రారంభిస్తాం

ఎస్‌జీఎఫ్‌ పోటీలను జిల్లాలో త్వరలో ప్రారంభిస్తాం. జిల్లాలో నాలుగు జోన్ల పరిధిలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశాం. రెండు రోజుల్లో ఆయా జోన్ల క్రీడా కార్యదర్శులను ఎన్నుకుంటాం. అనంతరం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి క్రీడాకారులను ఎంపిక చేస్తాం.

–ఎం కిరణ్‌ కుమార్‌,

ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

క్రీడల నిర్వహణకు

ప్రభుత్వం సహకారం

ఎస్‌జీఎఫ్‌ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తోంది. ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం మండలాని రూ .10 వేల చొప్పన కేటాయిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ నిధులు వెంటనే విడుదల చేస్తే క్రీడల నిర్వహణ మరింత సులువు అవుతుంది. పాఠశాల స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడా కారులుగా తీర్చి దిద్దడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం.

–అయితగాని శ్రీనివాస్‌, పీఈటీఏ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు

హుజూర్‌నగర్‌ : పాఠశాల స్థాయి విద్యార్థి దశ నుంచే బాలబాలికలు వారికి ఇష్టమైన క్రీడలపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలను ఈనెలలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది. మండల స్థాయి పోటీలు ఈనెల రెండో వారంలో, జోనల్‌ స్థాయి పోటీలు ఈనెల మూడో వారంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు రెండో వారంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా పోటీలు ఒక్కో స్థాయిలో రెండు రోజుల పాటు కొనసాగుతాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల పోటీలు నిర్వహించి ఆయా క్రీడల్లో ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం.

మూడంచెల పద్ధతిలో..

ఆటల పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహిస్తారు. అండర్‌–14, అండర్‌–17 విభాగంలో పాఠశాల విద్యార్థులు, అండర్‌–19 విభాగంలో ఇంటర్‌ విద్యార్థులకు మండల, జోనల్‌, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాను హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట, తుండతుర్తి జోన్లుగా విభజించారు. ఒక్కో జోనుకు ఒక క్రీడా కార్యదర్శి చొప్పున నలుగురు క్రీడా కార్యదర్శులను నియమించారు. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో క్రీడాంశంలో ఒక జట్టును ఎంపిక చేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందిస్తారు. వీటితో విద్య, ఉద్యోగాలకు క్రీడాకోటా కింద 2 శాతం రిజర్వేషన్ల సదుపాయం కూడా ఉంటుంది.

అన్ని పాఠశాలల విద్యార్థులకు..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. జిల్లాలోని 1వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు 979 ఉండగా వాటిలో విద్యార్థులు 45,918 మంది ఉన్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా విద్యార్థులు 18,062 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 78 ఉండగా విద్యార్థులు 3,079 మంది ఉన్నారు. ఉన్నత పాఠశాలలు 211 ఉండగా విద్యార్థులు 24,777 మంది ఉన్నారు. కేజీబీవీలు 18, ఆదర్శ పాఠశాలు 9, ఎంజీపీటీబీసీ 8, గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. వాటిలో దాదాపు 15 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.

క్రీడాంశాలు ఇవే..

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, తైక్వాండో, కరాటే, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌ బాల్‌, నెట్‌ బాల్‌, సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, బాల్‌ బ్యాట్‌మెంటన్‌, షటిల్‌, టేబుల్‌ టెన్నిస్‌, చదరంగం, అథ్లెటిక్స్‌లలో అండర్‌– 14, 17, 19 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలాని రూ.10 వేలు కేటాయిస్తుంది. ఈనెల చివరి వరకు మండలస్థాయి పోటీలను పూర్తి చేయాలి. సెప్టెంబరులో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం అవుతాయి.

ఫ ఈ నెల రెండో వారంలో

మండలస్థాయి, మూడో వారంలో జనల్‌స్థాయి పోటీలు

ఫ షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ

ఫ విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను

పెంపొందించడమే లక్ష్యం

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..1
1/2

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..2
2/2

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement