
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రభస
రేషన్ కార్డు రాలేదని
ఆందోళన చెందవద్దు
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): రేషన్‌కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని, ఎప్పుడైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చిని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ రావు, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, డీఎస్‌ఓ మోహన్ బాబు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ ,తహసీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీడీఓ హాసీం పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్‌లో బుధవారం జరిగిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మాట్లాడుతుండగా.. జై జగదీష్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాదనకు దిగారు. జై దామన్న అంటూ పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కేసీఆర్‌ను పొగుడుతూ బీఆర్‌ఎస్ హయాంలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందిందని చెబుతుండగా ఆయన ఉపన్యాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో వందల మంది ప్రాణాలు బలిగొన్నదని, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు కుంభకోణం చేసిందని విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టిన భిక్షతో అధికారం చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళాతీయించాడని ఆవేశంగా వేదికపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటకుదిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి బీఆర్‌ఎస్ కార్యకర్తలను బయటకు పంపారు. కలెక్టర్ కలగజేసుకొని ఇది రాజకీయ వేదిక కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వేదికని సర్దిచెప్పారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, రేషన్ కార్డులను ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.
ఫ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల
మధ్య తోపులాట

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రభస