గ్రామీణ రహదారుల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ రహదారుల అభివృద్ధి

Jul 26 2025 10:08 AM | Updated on Jul 26 2025 10:08 AM

గ్రామీణ రహదారుల అభివృద్ధి

గ్రామీణ రహదారుల అభివృద్ధి

సర్కిల్‌–2లో ఏడు నియోజకవర్గాలు..

నల్లగొండ సర్కిల్‌–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సర్కిల్‌ కింద రూ.389.73 కోట్ల వ్యయంతో 287.50 కిలోమీటర్ల పొడవునా 16 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గ్రామీణ రోడ్లును హైబ్రీడ్‌ ఆన్యూటీ మోడ్‌లో (హ్యామ్‌) అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్లను విస్తరిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి.

సర్కిల్‌–1లో ఐదు నియోజకవర్గాల్లో..

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక ప్యాకేజీగా తీసుకున్నారు. మొదటి సర్కిల్‌లో రూ.302.45 కోట్లతో 18 రోడ్లను అబివృద్ధి చేయనున్నారు. నల్లగొండ, మునుగోడు, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 223.12 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టనుండగా.. ఇందులో 38.4 కిలోమీటర్ల పొడవున డబుల్‌ రోడ్లుగా విస్తరించనున్నారు.

సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి

చేయనున్న రోడ్లు ఇవే..

● బరాకత్‌గూడెం –కాగిత రామచంద్రపురం రోడ్డు (నడిగూడెం, కాగితరామచంద్రపురం, సోమ్లా తండా) 7 కిలోమీటర్లు.

● శాంతినగర్‌ నుంచి ఎన్‌హెచ్‌ 9 వరకు వయా గోండ్రియాల రోడ్డు (శాంతినగర్‌, గోండ్రియాల, చిమిర్యాల) 11.60 కిలోమీటర్లు.

● కోదాడ–రేవూర్‌ రోడ్డు (కోదాడ, గుడిబండ,తొగర్రాయి, గనపవరం, ఎర్రారం)12.60 కిలోమీటర్లు

● రాయినిగూడెం–బరాకత్‌గూడెం రోడ్డు(బేతవోలు, సీత్లాతండా, పోలేనిగూడెం, బరాకత్‌గూడెం) 11.60 కిలోమీటర్లు.

● శాంతినగర్‌–నడిగూడెం రోడ్డు (శాంతినగర్‌, అనంతగిరి, అమీనాబాద్‌) 6 కిలోమీటర్లు.

● హుజూర్‌నగర్‌ లింక్‌ రోడ్డు 2 కిలోమీటర్లు.

● హుజూర్‌నగర్‌ రింగ్‌ రోడ్డు 4.15 కిలోమీటర్లు.

● దురాజ్‌పల్లి–గరిడేపల్లి రోడ్డు (దురాజ్‌పల్లి, సింగారెడ్డిపాలెం, అనంతారం ఎక్స్‌రోడ్డు, పెన్‌పహాడ్‌, మాచారం, దూపహడ్‌) 12.20 కిలోమీటర్లు. మరో ప్యాకేజీలో 15 కిలోమీటర్లు.

● హుజూర్‌నగర్‌–యాతవాకిళ్ల రోడ్డు (హుజూర్‌నగర్‌, లింగగిరి) 4 కిలోమీటర్లు.

● కోదాడ–రేవూర్‌ రోడ్డు (కందిబండ, హేమ్లాతండా, మేళ్లచెర్వు, రేవూర్‌) 7.45 కిలోమీటర్లు.

● హుజూర్‌నగర్‌–మేళ్లచెర్వు రోడ్డు (హుజూర్‌నగర్‌, వేపలసింగారం, మేళ్లచెర్వు) 11.10 కిలోమీటర్లు.

● దామరచర్ల–జాన్‌పహాడ్‌ రోడ్డు 4.50 కిలోమీటర్లు.

● సూర్యాపేట–నెమ్మికల్‌–దంతాలపల్లిరోడ్డు (గుండ్లసింగారం, నూతన్‌కల్‌, ఎర్రపాడ్‌ ఎక్స్‌రోడ్డు, మద్దిరాల) 18.40 కిలోమీటర్లు.

● సూర్యాపేట–నెమ్మికల్‌–దంతాలపల్లి రోడ్డు (కుడకుడ, ఐలాపురం, గుర్రంతండా, నెమ్మికల్‌, పాతర్లపహాడ్‌) 18 కిలోమీటర్లు.

● మామిడాల–కుంటపల్లి రోడ్డు (మామిడాల, గొట్టిపర్తి, రావులపల్లి ఎక్స్‌రోడ్డు, గుమ్మడపల్లి ఎక్స్‌రోడ్డు, కుంటపల్లి) 18.40 కిలోమీటర్లు

● మాచారం–చీదెళ్ల రోడ్డు (మాచారం, అనిరెడ్డిగూడెం, గాజులమల్కాపురం, చీదెల్ల రోడ్డు–11.00 కిలోమీటర్లు.

ఫ ఉమ్మడి జిల్లాలో

60 రోడ్ల విస్తరణ

ఫ హైబ్రీడ్‌ అన్యూటీ మోడ్‌లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి

ఫ రోడ్లు భవనాల శాఖ

ఆధ్వర్యంలో నిర్వహణ

ఫ టెండర్లను పిలిచేందుకు

అధికారుల కసరత్తు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవ

హ్యామ్‌ పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి మొదటి మూడు ప్యాకేజీల్లోనే అవకాశం కల్పించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కావడంతో జిల్లా రోడ్లను మొదటిలోనే అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్‌ పద్ధతిలో 17 ప్యాకేజీలుగా రోడ్ల అభివృద్ది, విస్తరణ చేయనుండగా, అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement