
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రతి విభాగం అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలోని వివిధ శాఖలకు చెందిన హెచ్‌ఓడీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ దావాఖానా కు వచ్చే పేషెంట్ల విషయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఆస్పత్రి హెచ్‌ఓడీలు.. ఓపీలను జాగ్రత్తగా గమనించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం అన్ని ఆపరేషన్లు, ఎంసీహెచ్‌లో డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలన్నారు. టీబి రోగులు కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి సేవలందించాలన్నారు. పలు సూచనలు చేశారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జయలత, డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
మెనూ అమలు చేయాలి
అనంతరం జిల్లా విద్యా శాఖ, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ప్రతి వారం మనోధైర్యం కల్పించేలా సినిమాలు చూపించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేసిఒక టీచర్‌ను ఇన్‌చార్జిగా నియమించాలన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
మునగాల: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. శుక్రవారం ఆయన మునగాలలోని పీహెచ్‌సీని సందర్శించి మొక్కలు నాటా రు. అనంతరం స్థానిక పీహెచ్‌సీలో పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. పీహెచ్‌సీలో ఫర్నీచర్ కొనుగోలుకు తక్షణమే రూ.లక్ష చెక్కును వైద్యాధికారికి అందచేశారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్య మైన విద్యనందించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, ఎంపీఓ నరేష్, తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఏపీఓ శైలజ, ఏఓ రాజు, పీఆర్ ఏఈ వసంత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరిత, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్, స్టాఫ్‌నర్స్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్