
కోర్టుల్లో సిబ్బంది కొరత తీరుస్తాం
హుజూర్‌నగర్ : జిల్లాలోని కోర్టుల్లో సిబ్బంది కొరతను త్వరలోనే తీరుస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం హుజూర్‌నగర్‌కు వచ్చిన ఆమె కు స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ వాదులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని కోర్టు హాళ్లను తిరిగి వసతులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఆ తర్వాత స్థానిక రామస్వామి గుట్టవద్ద న్యాయ స్థానాలకు కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, జిల్లా అదనపు పీపీ బొబ్బ కోటిరెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీస్, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద