
నేరాల నివారణకు ప్రత్యేక నిఘా
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షల అమలు, డయల్ 100 కాల్స్, సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్యూ ఆర్ కోడ్ పని తీరు, ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడీ షీటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని, పెట్రోలింగ్, బీట్స్ సమర్థంగా నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. దుకాణ సముదాయాలు, కాలనీలు, గ్రామాలతో పాటు రహదారుల వెంట సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. వర్షసూచన ఉన్నప్పుడు అప్రమత్తంగా పని చేయాలన్నారు. అనంతరం గంజాయి, నకిలీ విత్తనాల స్వాధీనం కేసుల్లో బాగా పని చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌కు మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్ అందించి అభినందించారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హరిబాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివ కుమార్, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ