
సంక్షేమ పఽథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి
సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ, చకిలం రాజేశ్వరరావు, కోతి గోపాల్ రెడ్డి, సురేష్ రావు, వీరన్న నాయక్, కక్కిరేణి శ్రీనివాస్, వేముల కొండ పద్మ, చింతమల్ల రమేష్,తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, గుడిపాటి నరసయ్య, ఎలిమినేటి అభినయ్, తండు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్
ఫోటోఫైల్ నెం : 22ఎస్‌పిటి 152 టు 155