
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలో గల శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు, రాజేష్ పాల్గొన్నారు.
చేయూత పింఛన్లు
పెంచాలి
సూర్యాపేట అర్బన్ : చేయూత పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్‌చార్జి గడ్డం ఖాసిం, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దె రాజేష్, షేక్ నయీమ్, చింత వినయ్ బాబు, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, వీరస్వామి, వెంకన్న మాదిగ, చింత జాన్ విల్సన్ మాదిగ, విజయరావు, స్నేహలతచౌదరి, ఎండి.జహీర్ బాబా, పేరెల్లి బాబు, పేర్ల సోమయ్య, గుండు శ్రీనివాస్, నూకపంగు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.
శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవతో పాటు స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం, జోడు సేవ తదితర పూజలు నిర్వహించారు.
16న మత్స్యగిరిలో
వేలం పాటలు
వలిగొండ : వలిగొండ మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ దుకాణాల నిర్వహణ, స్వామివారి నిత్యకై ంకర్యాలకు పూజా సామగ్రి సమకూర్చడానికి ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ మోహన్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5,18,28 తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదాపడినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొనాలని కోరారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం