
సమస్యల పరిష్కారంలో పీఆర్‌టీయూ ముందంజ
చివ్వెంల(సూర్యాపేట) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్‌టీయూ ముందంజలో ఉంటుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల సురేష్ పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పీఆర్‌టీయూ సభ్వత్వ నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పీఆర్‌టీయూతోనే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఒనగూరాయన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కృషితో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ బషీర్, పొదిల రవీందర్, నాయకులు ప్రతాప్ కుమార్, ఖలీల్ అహ్మద్, గిరి ప్రసాద్, కోట యాదగిరి, షేక్ షాబొద్దీన్, భుక్యా శ్రీను, బుక్క రమేష్, తలశెట్టి కరుణాకర్, సతీష్, మోహన్ రెడ్డి, సాజిత్, వెంకట్ రెడ్డి, జిలకర శ్రీనివాస్ పాల్గొన్నారు.