
వారికి ప్రకృతి అంటేప్రాణం.. పచ్చని చెట్లే నేస్తాలు.. వా
చిన్న అడవినే పెంచారు..
భువనగిరి: ఇంటినిండా మొక్కలు పెంచుకుంటారు చాలా మంది. కానీ, ఆ ఇంట్లో మొక్కల వనాన్నే సాగు చేస్తున్నారు. ఒకటా, రెండా 68 రకాల మొక్కలకు నెలవు. భువనగిరిలోని స్రిగ్దకాలనీకి చెందిన దిడ్డి బాలాజీ– డాక్టర్ జయశ్రీ దంపతులు.. నర్సరీలు, మరెక్కడైనా కొత్త రకం మొక్కలు కనిపిస్తే వాటిని తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటుతారు. ఇందులో న్యూజిలాండ్ నుంచి తెచ్చిన మొక్కలు సైతం ఉన్నాయి. తమ ఇంటి స్థలంలో సుమారు 600 గజాలు మొక్కలకే కేటాయించడం విశేషం. వీరు పెంచుతున్న మొక్కల్లో పూలు, షో మొక్కలతో పాటు పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా జామ, నిమ్మ, ఆరెంజ్, ఆరటి, దానిమ్మ, మామిడి, సపోట, పనస, రామసీతాఫలం చెట్లు పెంచుతున్నారు. చెట్ల మధ్య నిత్యం పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తుంటాయి.
భువనగిరిలోని స్రిగ్దకాలనీలో దిడ్డి బాలాజీ
ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు