
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
సూర్యాపేట : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మకమని గుర్తు చేశారు. గతబీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోదీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌లు వేములకొండ పద్మ, బోయినపల్లి రేఖ, బోధ లక్ష్మమ్మ, కావ్య శ్రీ, పావని, ఊట్కూరీ దివ్య తదితరులు పాల్గొన్నారు.