
24 వేల కొత్త కార్డులు
అర్హులందరికీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించనున్నాం. ఇప్పటి వరకు కొత్తగా 24,082 మందికి కార్డులు మంజూరు కాగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
– మోహన్‌బాబు,
జిల్లా సివిల్ సప్లయ్ అధికారి
భానుపురి (సూర్యాపేట) : నిరుపేద ప్రజల నిరీక్షణకు తెరపడనుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు మంజూరు చేసే రేషన్ కార్డుల జారీ దాదాపు పదేళ్లుగా నిలిచిపోయింది. కేవలం హుజూర్‌నగర్ ఉప ఎ న్నిక సమయంలో అక్కడి ప్రజలకు మాత్రమే కొన్ని కార్డులు మంజూరు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క కార్డు ఇవ్వకపోవడంతో వేలాది మంది నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 14వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 3,26,057 రేషన్ కార్డులు
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా పేర్కొంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,26,057 రేషన్ కార్డులు ఉన్నాయి. గత పదేళ్ల నుంచి మార్పులు, చేర్పుల నిమిత్తం 52వేల దరఖాస్తులు, కొత్త కార్డుల కోసం 32,641 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్డుల్లో దాదాపు 94,871 యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏడాది దాటినా కార్డులను మంజూరు చేయకపోవడంతో చాలామంది వివిధ పథకాలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెలలో అప్పటికే కార్డులు ఉండి మార్పులు, చేర్పుల కోసం చేసుకున్న దరఖాస్తులకు మోక్షం కల్పించారు. దాదాపు అన్ని దరఖాస్తులను అదే నెలలో పూర్తి చేశారు.
చకాచకా కార్డుల మంజూరు
ఇన్నాళ్లుగా మూలకు ఉన్న రేషన్‌కార్డు దరఖాస్తుల దుమ్మును అధికారులు దులుపుతున్నారు. రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరం సాగేదైనా.. ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీంతో అర్హులైన అందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో ఆర్‌ఐలు దరఖాస్తుల పరిశీలన చేపడుతుండగా.. తహసీల్దార్లు, అక్కడి నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ ప్రక్రియను ఎక్కడ ఆలస్యం లేకుండా చకాచకా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 32,641 దరఖాస్తులకు గాను 24,082 దరఖాస్తులకు మోక్షం లభించింది. 24,082 కొత్త రేషన్ కార్డులతో దాదాపు 73,364 మందికి ప్రయోజనం చేకూరింది. 782 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా.. మరో 19,629 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి.
నిరీక్షణకు తెర..!
ఫ రేషన్ కార్డులు మంజూరు
ఫ 14న తిరుమలగిరిలో ముఖ్యమంత్రి
చేతుల మీదుగా పంపిణీ
ఫ ఈలోగా మరిన్ని కార్డులు
ఇవ్వనున్న ప్రభుత్వం
మండలాల వారీగా
కొత్త కార్డులు..
మండలం కొత్త కార్డులు
అనంతగిరి 799
ఆత్మకూర్ 881
చిలుకూరు 1147
చింతలపాలెం 929
చివ్వెంల 1339
గరిడేపల్లి 2308
హుజూర్‌నగర్ 1900
జాజిరెడ్డిగూడెం 577
కోదాడ 1101
మద్దిరాల 655
మఠంపల్లి 813
మేళ్లచెరువు 984
మోతె 308
మునగాల 738
నడిగూడెం 352
నాగారం 439
నేరేడుచర్ల 1159
నూతనకల్ 900
పాలకవీడు 595
పెన్‌పహాడ్ 1003
సూర్యాపేట 3386
తిరుమలగిరి 498
తుంగతుర్తి 1271
మొత్తం 24,082

24 వేల కొత్త కార్డులు