
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆత్మకూర్ (ఎస్) : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లలను రోజూ పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. బాసిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.