
సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పట్టణంలో ఈనెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. తిరుమలగిరిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్, ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వీఐపీ, అధికారుల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హెలిపాడ్ నుంచి సభా వేదిక వరకు అప్రోచ్ రోడ్డు వేయాలని, డబుల్ బారి కేడ్లు నిర్మించాలని ఆదేశించారు. హెలిపాడ్, అప్రోచ్ రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. సభకు ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ లోపలికి, బయటకు వెళ్లేలా రెండు దారులు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల కోసం తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్, డీఆర్‌డీఓ అప్పారావు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, డీపీఓ యాదగిరి, డీఎండబ్ల్యూఓ జగదీష్‌రెడ్డి, డీటీడీఓ శంకర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రాంక్లిన్, తహసీల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మున్వర్‌అలీ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్