
రాజీ మార్గమే రాజమార్గం
చివ్వెంల(సూర్యాపేట) : రాజీ మార్గమే రాజమార్గమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టులో నిర్వహించిన రెగ్యులర్ లోక్ అదాలత్‌లో భాగంగా మోటార్ వెహికిల్ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీలతో రాజీపడిన బాధితులకు రూ.1.29 కోట్ల చెక్కులను ఆమె అందజేసి మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడటం వల్ల సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, కక్షిదారుల తరఫు న్యాయవాది గోండ్రాల అశోక్, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది జె.శశిధర్, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద