
తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాలలు
కోదాడ: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ‘విద్య– వైద్యం ప్రభుత్వం బాధ్యత’ అనే నినాదంలో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఆయన చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రచార జాతా సోమవారం కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా కోదాడ రంగా థియేటర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కారు బడులు నిలబడాలంటే ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు. అంతరాలు లేని చదువు ఉన్నప్పుడే ప్రభుత్వ బడులు మనగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పౌరస్పందన వేదిక కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఏ. మంగ, ధనమూర్తి, బుర్రా పుల్లారెడ్డి, బుర్రా సుధారాణి, వెంకటరమణ. పి. శ్రీనివాస్, నాగేశ్వరరావు, పాండురంగాచారి, ఆంజనేయులు, వెంకటేశ్వరరెడ్డి, బుచ్చయ్య, మోతి లాల్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి