కోదాడ మార్కెట్‌ అభివృద్ధికి సహకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

కోదాడ మార్కెట్‌ అభివృద్ధికి సహకరిస్తాం

May 26 2025 1:31 AM | Updated on May 26 2025 1:55 AM

కోదాడ మార్కెట్‌ అభివృద్ధికి సహకరిస్తాం

కోదాడ మార్కెట్‌ అభివృద్ధికి సహకరిస్తాం

కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్‌ను మోడల్‌ మార్కెట్‌గా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి ఉత్తమ్‌ నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం సభ్యులు మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రులకు వివరించారు. మార్కెట్‌లో నిర్వహిస్తున్న పశువుల సంతకు మరోచోట స్థలంతోపాటు మండలానికి ఒక వ్యవసాయ గోదాము నిర్మాణానికి నిధులు కేటాయించాలని, లింక్‌ రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పాలకవర్గం సభ్యులు కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారని పాలకవర్గం తెలిపింది. మంత్రులను కలిసిన వారిలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఏపూరి తిరపతమ్మ, వైస్‌ చైర్మన్‌ ఎస్‌.కె బషీర్‌, మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, మార్కెట్‌ డైరెక్టర్లు ఉన్నారు.

ఫ మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌ హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement