సత్వర న్యాయానికే లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయానికే లోక్‌ అదాలత్‌

Mar 9 2025 1:31 AM | Updated on Mar 9 2025 1:29 AM

చివ్వెంల: పెండింగ్‌ కేసులను పరిష్కరించి కక్షిదా రులకు సత్వర న్యాయం అందించేందుకే మెగాలోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్‌శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొడవలు జరిగినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడటం వల్ల పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా వీడిగా ఉంటున్న భార్యభర్తలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి కోర్టు హాల్‌లో ఒక్కటి చేశారు. ఈ సందర్భంగా క్రిమినల్‌, సివిల్‌, వెహికల్‌ యాక్టు, విద్యుత్‌, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్‌ వంటి 5,708 కేసులను పరిష్కరించారు. కోర్టులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి సూర్యాపేట జనరల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, పిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వి.వెంకటరమణ, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు నూ కల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, సీనియర్‌, జూని యర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్‌ శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యూడిషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జడ్జీలతోపాటు జ్యుడిషియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి మధు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, ఏపూరి సంజయ్‌, ఎల్గూరి మహేశ్వర్‌, జునైద్‌, శ్రీకాంత్‌, నాగంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఫ జిల్లా ఇన్‌చార్జి ప్రధాన

న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ

ఫ లోక్‌ అదాలత్‌లో

5,708 కేసులు పరిష్కారం

సత్వర న్యాయానికే లోక్‌ అదాలత్‌1
1/1

సత్వర న్యాయానికే లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement