మట్టపల్లిలో నిత్యారాధనలు | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్యారాధనలు

Mar 9 2025 1:31 AM | Updated on Mar 9 2025 1:29 AM

మఠంపల్లి: మట్టపల్లిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి మహాక్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాలా ర్చన, సుప్రభాతసేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నూతన పట్టు వస్త్రాలతో వధువరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్య, శాశ్వత కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక దర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

మహిళలపై దాడులను వ్యతిరేకించాలి

భానుపురి: మహిళలపై మనువాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ)రాష్ట్ర అధ్యక్షురాలు డి.స్వరూప, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ నుంచి గాంధీ పార్కు వరకు మహిళల భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ పార్కులో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారాసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు రాజకీయ విధానాల వల్ల మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో కారింగుల వెంకన్న, కొత్తపల్లి రేణుక, శిరీష, జయమ్మ, పద్మ, లక్ష్మి, పావని, రేష్మ, శ్యామల, మరియమ్మ, సత్తెమ్మ, మాలంబి, పద్మ, పేర్ల మల్లమ్మ, గౌనమ్మ, లక్ష్మి, కల్పన, రేణుక, చిట్టి తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసీ విద్యకు డిమాండ్‌

సూర్యాపేట: ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మసీ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని రాష్ట్ర డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌ ఎ.రామకిషన్‌ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని వికాస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌స్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్‌ డేకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా తర్వాత ఫార్మసీ విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ముందుగా బీ ఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థులకు బంగారు పతకాలు, యూనివర్సిటీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెయిన్‌ బో ఆసపత్రుల ఉపాధ్యక్షులు డాక్టర్‌ నీరజ్‌భాయ్‌, ఎస్‌బీ లైఫ్‌ సైన్స్‌స్‌ సీఈఓ హరీష్‌రెడ్డి, కిష్ట్రాన్‌ ఫార్మా లిమిటెడ్‌ డైరెక్టర్‌ జె. క్రిష్ణప్రసాద్‌, రాష్ట్ర ఫార్మసీ కళాశాలలో సంఘం అధ్యక్షుడు కె.రాందాస్‌, కళాశాల కరస్పాండెంట్‌ సాధినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ ఆడెపు రమేష్‌, పరిపాలన అధికారి దేవులపల్లి వినయ్‌, కిషోర్‌, నీలమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థికి

బంగారు పతకం

చివ్వెంల: తెలగాంణ స్టేట్‌ 11వ యూత్‌ అఽథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో చివ్వెంల బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి జి.విశాల్‌ ప్రతిభ కనబర్చాడు. ఇటీవల హైదరాబాలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన అండర్‌–14 (60 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, హైజంప్‌) విభాగాల్లో విశాల్‌ సత్తాచాటి బంగారు పతకం సాధించాడు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విశాల్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌, పీడీ కృష్ణారెడ్డి, పీఈటీ రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యారాధనలు1
1/2

మట్టపల్లిలో నిత్యారాధనలు

మట్టపల్లిలో నిత్యారాధనలు2
2/2

మట్టపల్లిలో నిత్యారాధనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement