సూర్యాపేటటౌన్ : జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కేసులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా పని చేయాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ఆయన పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్ సర్టిఫికెట్, పోస్టుమార్టం నివేదిక, వైద్యులతో సమన్వయంతో పని చేయడం, మెడికల్ సర్టిఫికెట్స్ పొందడంలో మెళకువలు, సమస్యలు తదితర అంశాలపై స్థానిక వైద్య కళాశాల డాక్టర్ కిషోర్, క్రాంతి కిరణ్ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేయాలన్నారు. మహిళా సంబంధిత ఫిర్యాదులపై త్వరగా, కేసులపై వేగంగా స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. నేరాల నివారణకు జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ లు, తనిఖీలు, పటిష్టమైన పెట్రోలింగ్, పోలీస్ బీట్స్ నిర్వహించాలన్నారు. అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. కోర్టుల్లో అధికారులతో సమన్వయంగా పని చేయాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన కంప్యూటర్స్, ట్యాబ్ లు ఇతర సాంకేతికత సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ మట్టయ్య, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్