సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొత్తం 32 సెంటర్లలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో 7,217 మంది విద్యార్థులకు 307 మంది గైర్హాజరు కాగా 6,910 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,562 మందికి 218 మంది గైర్హాజరు కాగా 1,344 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీ చేశారు.
సూర్యాపేట పట్టణపోలీస్ స్టేషన్ నుంచి
13 సెంటర్లకు ప్రశ్నాపత్రాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లోగల స్ట్రాంగ్ రూమ్ నుంచి 13 సెంటర్లకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టమెంటల్ అధికారులు, పేపర్ కస్టోడియన్ల నుంచి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నాపత్రాలను క్లోజ్డ్ వెహికిల్ ద్వారా పరీక్ష కేంద్రాలకు తరలించారు. డీఐఈఓ భానునాయక్ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు కృష్ణయ్య, లక్ష్మయ్య, 13 పరీక్షా కేంద్రాల సీఎస్‌లు, డీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం
ఫ 525 మంది గైర్హాజరు