విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి

Mar 6 2025 2:00 AM | Updated on Mar 6 2025 1:56 AM

త్రిపురారం: వరి విత్తనాలను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదని, రైతులు తమ పొలంలోనే పండించిన వరి ధాన్యాన్ని విత్తనాలుగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌(ఈఈఐ) ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుబాబు అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి, జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో శాస్త్రవేత్తలు వ్యసాయంలో రైతులకు అందించిన సలహాలు సూచనలు, అదేవిధంగా 2025–26వ సంవత్సరంలో అందించే సేవలపై శాస్త్రవేత్తలు సమీక్ష చేశారు. కేవీకే కంపాసాగర్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు గాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థిరమైన వరి ఉత్పత్తికి నేరుగా విత్తే పద్ధతి, ప్రకృతి వ్యవసాయం, బేకరీ ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్‌, కూరగాయల సాగు, కోళ్లు, గొర్రెల పెంపకం, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్‌ మధుబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు అవసరమయ్యే వాటిపై నూతన ప్రయోగాలు చేయాలన్నారు. అనుభవం ఉన్న రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇతర రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుండాలన్నారు. ఈ ఏడాది రైతులకు అందించాల్సిన సేవలపై ముందస్తుగా ప్రణాళిక ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం హెడ్‌ అనిల్‌, ఏడీఆర్‌ సుధాకర్‌, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ చంద్రశేఖర్‌, రాములమ్మ, హాహలియా ఏడీఏ రవీందర్‌, ఉద్యానవన అధికారి మురళి, పలువురు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌

ప్రొఫెసర్‌ మధుబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement