ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్‌రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్‌తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్‌రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.