పోషకాహార లోపం.. శాపం | - | Sakshi
Sakshi News home page

పోషకాహార లోపం.. శాపం

Mar 2 2025 1:20 AM | Updated on Mar 2 2025 1:20 AM

పోషకా

పోషకాహార లోపం.. శాపం

బలహీనంగా

జన్మిస్తున్న శిశువులు

గర్భిణులు పౌష్టికాహారం

తీసుకోకపోవడమే కారణం

చిన్నారుల శారీరక, మానసిక

ఎదుగుదలపై తీవ్ర ప్రభావం

జిల్లా వ్యాప్తంగా పోషణ

లోపమున్న పిల్లలు 1,026 మంది

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం

పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం స్థానంలో మరిన్ని ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం (బాలామృతం ప్లస్‌)ను అందిస్తున్నాం. అంతేకాకుండా పోషకాహార లోపం కలిగిన పిల్లల తల్లిదండ్రులకూ అవగాహన కల్పించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం.

– నర్సింహారావు,

జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట

హుజూర్‌నగర్‌: పోషకాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు శాపంగా మారుతోంది. ఈ లోపం చిన్నారుల శారీరక, మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువు, బలహీనంగా ఉంటున్నారు. జిల్లాలో తీవ్ర, అతితీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు మొత్తం 1,026 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో పోషణలోపం ఉన్నవారు 900 మంది కాగా అతితీవ్ర పోషణ లోపం ఉన్నవారు 126 మంది ఉన్నారు. గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో ప్రతి 100 మందిలో 20 మంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

తల్లిదండ్రులు

ఏం చేయాలంటే..

చిన్నారులు భోజనం సరిగ్గా చేయకున్నా.. పౌష్టికాహారం తీసుకోకున్నా ఇంటి వద్ద వారికి ఇష్టమైన పదార్థాలు వండి తినిపించే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. చిరు ధాన్యాలతో వండిన భోజనం, బెల్లం, పల్లీలు, నువ్వుల పట్టీలు తినిపించాలి. పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కాయగూరలతో ఆహారం వండి తినిపించడం ద్వారా పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని ఐసీడీఎస్‌ అధికారులు అంటున్నారు.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 05

అంగన్‌వాడీ కేంద్రాలు 1,209

మూడేళ్లలోపు చిన్నారులు 25,139

3 నుంచి 6 ఏళ్లలోపు వారు 14,819

ఆకలి పరీక్షతో గుర్తింపు..

ఇంటి వద్ద సరిగ్గా ఆహారం తీసుకోని చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకలి పరీక్షలు నిర్వహిస్తారు. కేంద్రానికి వచ్చిన చిన్నారులు 200 గ్రాముల బాలామృతం 45 నిమిషాల్లో తినాలి. తినని వారిని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)కు తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఆహారం ఎందుకు తీసుకోవడం లేదో వైద్యుల పర్యవేక్షణలో గుర్తిస్తారు. అలాంటి చిన్నారులను 15 రోజుల పాటు వారి పర్యవేక్షణలోనే ఉంచుకుని పౌష్టికాహారం అందిస్తారు. వీరందరికీ ఆటాపాటలతో కూడిన విద్యతోపాటు ఒకపూట సంపూర్ణ భోజనం, ఉడికించిన కోడి గుడ్డు అందజేస్తారు.

పోషకాహార లోపం.. శాపం1
1/2

పోషకాహార లోపం.. శాపం

పోషకాహార లోపం.. శాపం2
2/2

పోషకాహార లోపం.. శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement