
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఎస్పీ, డీఈఓ
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు తెలిపారు. బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యాదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12,386 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డీఎస్పీ నాగభూషణం మున్సిపల్ కమిషనర్లు, పోలీస్, పోస్టల్, విద్యుత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.