వణికించిన వాన
● పునరావాసం
● కదం తొక్కిన కార్మికులు
జిల్లాలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా మధ్యాహ్నం కాస్త తెరిపిచ్చింది. సాయంత్రం మళ్లీ ఒక్కసారిగా మేఘావృతమై భారీ గాలులతో కూడిన వర్షం పడటంతో ఉద్దానంలో జీడి, మామిడితోటలకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టి మండలం భరణికోట పంచాయతీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నరసన్నపేట మండలం కోమర్తి కాలనీ కూడలి వద్ద భారీ చెట్టు నేలకొరగడంతో ఉర్లాం రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. గార మండలం వమరవల్లి జంక్షన్ నుంచి కళింగపట్నం మధ్యలో భారీ వృక్షాలు కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం / నరసన్నపేట/వజ్రపుకొత్తూరు/గార/మెళియాపుట్టి
శ్రీకాకుళం : జిల్లా వ్యాపారులపై గ్యాస్ పిడుగు పడింది. చమురు సంస్థలు గురువారం రాత్రి అకస్మాత్తుగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.993 పెంచేశారు. శుక్రవారం నుంచే కొత్త ధర రూ.3198 అమల్లోకి తీసుకురావడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గతంలో ఎన్నడూ లేదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నెలరోజులుగా గ్యాస్‌కు కొరత ఏర్పడినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొరత లేదంటూ ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. ధరలు కూడా పెంచలేదు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో గ్యాస్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పదేపదే చెబుతూ వస్తున్న చమురు సంస్థలు ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ ధరే పెంచినప్పటికీ, మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇంటికి వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు ధరలు కూడా పెంచుతాయని పలువురు చర్చించుకుంటున్నారు.
దుకాణాల మూత..
గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే చిన్న చిన్న హోటళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ఒకేసారి కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం, దానికి కూడా కొరత ఉండడంతో పెద్ద హోటళ్లు కూడా మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలో కమర్షియల్ సిలిండర్లు రోజుకు 500 వరకు డెలీవరీ అవుతాయి. ఇంత స్థాయిలో చమురు సంస్థల
నుంచి గ్యాస్ దిగుమతి కావడం లేదు. ఇప్పుడు ఒకేసారి రూ.993 పెంచడం వల్ల వర్తకులపై నెలకు కోటిన్నర రూపాయల వరకు భారం పడుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ విపరీతమైన పోటీ పెరగడం వల్ల రేట్లను పెంచే పరిస్థితి లేకపోగా గ్యాస్ భారాన్ని ఏ విధంగా అధిగమించాలన్న దానిపై వర్తకులు ఆలోచనలు చేస్తున్నప్పటికీ సరైన మార్గం దొరక్క మదనపడుతున్నారు. చమురు సంస్థలు పునరాలోచన చేసి ధరను తగ్గించాలని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వర్తకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
టెక్కలి/సంతబొమ్మాళి: ఉత్తరాంధ్రకే తలమానికంగా, జిల్లాకు మణిహారంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంతబొమ్మాళి మండలం మూలపేటలో సుమారు రూ.4361.91 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 ఏప్రిల్ 19న పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఓవైపు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ, మరోవైపు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు నౌపడ సమీపంలో సుమారు 58 ఎకరాలను గుర్తించి కాలనీ పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలోనే పోర్టు పనులు ముమ్మరం చేస్తూ కాలనీ ఎర్త్ పనులు పూర్తి చేశారు. ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో మొత్తం అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కాలనీలో మౌలిక సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. రోడ్లు, మురుగు కాలువలు, పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయం లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది.
586 కుటుంబాలకు పునరావాసం..
పోర్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా నిరాశ్రయులైన మూలపేట, విష్ణుచక్రం తదితర గ్రామాలకు చెందిన సుమారు 586 కుటుంబాల కోసం నౌపడ సమీపంలో సుమారు రూ.149 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో పునరావాస కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలనీ నిర్మాణానికి అప్పట్లో రూ.35 కోట్లు కేటాయించారు. విష్ణుచక్రం గ్రామస్తులు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకోగా, మూలపేట గ్రామస్తులు షెడ్లు ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కాలనీలో సీసీ రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారి నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారవుతోంది. ఇప్పటికై నా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
కనీస వసతులు కరువు
పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్లు లేక చిన్నపాటి వర్షానికే బురదగా మారుతోంది. పక్కా ఇళ్ల కోసం తాత్కాలికంగా వేసిన షెడ్లు గాలికి ఎగిరిపోతున్నాయి.
– జీరు శివ, మూలపేట గ్రామస్తుడు
పనుల్లో నిర్లక్ష్యం...
మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తుల త్యాగాలకు ప్రతీక మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు. జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతానికి పోర్టు తీసుకొచ్చారు. నౌపడ వద్ద పునరావాస కాలనీ నిర్మాణానికి నిధులు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలనీ సంగతే మర్చిపోయారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందిపెడుతున్నారు. ఇకనైనా పాలకులు చిత్తశుద్ధిగా వ్యవహరించాలి.
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి
నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మూలపేట పోర్టు కోసం సర్వస్వం త్యాగంచేసిన మూలపేట, విష్ణుచక్రం తదితర గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు కల్పించకుండా చోద్యం చూస్తోంది. రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది.
పునరాలోచన చేయాలి
చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ల ధర విషయమై పునరాలోచన చేయాలి. ఒకేసారి 993 పెంచడం వల్ల హోటల్, రెస్టారెంట్ యాజమా న్యాలు ఇబ్బందులు పడతాయి. ఇవి మూతపడితే పలు కుటుంబాలు పనులు లేక రోడ్డున పడతారు. – మెట్ట నాగరాజు,
హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
మౌలిక వసతులకు నోచుకోని మూలపేట పోర్టు పునరావాస కాలనీ
మంచినీరు, రోడ్లు, కాలువలు లేక ఇక్కట్లు
కొద్దిపాటి వర్షం పడినా చిత్తడే
పట్టించుకోని కూటమి ప్రభుత్వం


