అభయం
చిన్నతనంలో పెద్దకష్టంకొడుక్కి వచ్చిన కష్టం ఆ తండ్రికి పరీక్ష పెడుతోంది. నిలువ నీడ కూడా లేని పరిస్థితి వచ్చింది. –8లో
ఎవరు తీసిన గోతిలో వారే..
న్యూస్‌రీల్
రథసప్తమి వీవీఐపీ పాసుల కుంభకోణం కేసులో అనేక మలుపులు
ఇన్‌ఫ్లూయెన్సర్లను తప్పించే పనిలో రాజకీయ నాయకులు ప్రింటింగ్, జిరాక్స్ సెంటర్ల వారిని బలిపశువులను చేసే యత్నం జిల్లా అధికారులే తమని వాడుకున్నారంటూ రివర్స్‌గేమ్ ఆడుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు
శ్రీకాకుళం
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
వారికి
ఆ.. భయం
శ్రీకాకుళం క్రైమ్:
రథసప్తమి వేడుకల వీఐపీ, వీవీఐపీ పాసుల కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం నలుగురు జిరాక్స్, ప్రింటర్ షాపు యజమానులను, మరో ఐదుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త దావానలంలా పాకడం, ప్రభుత్వ పెద్దలకూ విషయం తెలియడంతో సూర్యనారాయణ స్వామి సన్నిధిలో అసలు ఏం జరిగిందన్నదానిపై ఇప్పటికే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో తెరవెనుక ఉన్న సూత్రధారుల మంత్రాంగం ఇప్పటికే మొదలైంది. దాని పర్యవసానంగా శుక్రవారం పోలీసులు ఎదుట హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో కీలక వ్యక్తి ప్రశాంత్, మరో వ్యక్తి రివర్స్ గేమ్ ఆడినట్లు సమాచారం.
ఉన్నతాధికారులు పిలవడంతోనేనంటూ..
జిల్లా ఉన్నతాధికారులే తమను వేడుకలకు ఆహ్వానించారని, అధికారులు అన్ని విధాలా తమను వాడుకున్నారని ఇన్‌ఫ్లూయెన్సర్లు రివర్స్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాము తీసిన వీడియోల వల్లనే వేడుకకు అంతమంది జనం వచ్చారని చెప్పినట్లు సమాచారం.
ఇన్‌ఫ్లూయెన్సర్లను తప్పించే పనిలో..
మరోవైపు ఈ డూప్లికేట్ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో వెనక ఉన్న సూత్రధారులే ఇలా మాట్లాడించినట్లు తెలుస్తోంది. ఇన్‌ఫ్లూయెన్సర్లు నోరు విప్పితే ఎక్కడ తమ జాతకాలు బయట పడతాయేమోనని ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లను తప్పించే పనిలో పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేసులో ఉండరు. ఎలాగైనా తప్పిస్తాం’ అని కొంతమంది జిల్లా కీలక నేతల అనుచరులు అభయమిస్తున్నట్లు సమాచారం. దీంతో గత మూడు రోజులుగా పోలీసులు ఎప్పుడు పిలుస్తుంటే అప్పుడు వెళ్తున్న జిరాక్స్ ప్రింటర్ షాపుల వారినే బుక్ చేస్తారేమోననే అనుమానం వ్యక్తమవుతోంది. జిరాక్స్ షాపువాళ్లకు వీవీఐపీ పాస్‌ల సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ అందించిన అసలైన నిందితులు.. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో తప్పించుకుంటారనే ప్రచారం జరగుతోంది.
రథసప్తమి వేడుకల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం జిల్లా వాసులు గమనించారు.
పౌర విమానయాన శాఖ అనుమతి లేనిదే హెలికాప్టర్ వద్దకు మొబైల్ తీసుకెళ్లడానికి లేదు. కానీ వీరు మాత్రం చాలా సులువుగా మొబైళ్లతో వీడియోలు తీసుకున్నారు.
సామాన్యులు రూ.2200 పెడితే గానీ
హెలికాప్టర్ దరిదాపుల్లోకి అనుమతించలేదు. కానీ వీరంతా ఉచితంగానే హెలికాప్టర్ ఎక్కడమే కాకుండా.. కింద అధికారులకు టాటా చెబుతూ వీడియోలు కూడా తీశారు. ఆ దృశ్యాలు చూసి ప్రజలు, మీడియా
ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.
అభయం
అభయం


