ట్రిపుల్ ఐటీలో వర్క్‌షాపు ప్రారంభం
ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సారిక టెక్నాలజీ సంస్థ సహకారంతో ‘జీఈఎన్‌ఏ1 ఎస్‌డీఎల్‌సీ’ అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ను డైరెక్టర్ కొక్కిరాల వెంకటధన బాలాజీ శుక్రవారం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ బాలాజీ సూచించారు. సంస్థ సీఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కోడా దిలీప్‌కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించగా, డి.పద్మావతి సహ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


