కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
రణస్థలం: పీఎం మోదీ తెచ్చిన 2025 జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతులకు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడుతామని శుక్రవారం రణస్థలంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ పాత చట్టం రద్దుతో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సింహులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.


