పెంచుతోంది దడ
పెంచుతోంది దడ పెరుగుతున్న
ధర.. పెరుగుతున్న బంగారం ధరలు దొంగతనాలను పెంచుతున్నాయి. గడిచిన ఏడాదిలో బంగారం కోసం హత్యలు 8 నమోదు కాగా.. శుక్ర వారం శ్రీకాకుళం మండలంలో ఏకంగా రెండు ఘటనల్లో పుస్తెల తాళ్లు తెంపుకునిపోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం తులం బంగారం ధర దాదాపు రూ. 2 లక్షలు పలుకుతుండటంతో ఇలాంటి దాడులు పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మహిళలను ముఖ్యంగా వృద్ధురాళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఆరంభంలో బెదిరించడం, ఆపై ప్రతిఘటిస్తే దాడులు చేసి హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. మరి కొందరు ఆటోల్లో బ్యాగులను కోసేసి నగలు దోచుకుంటుండగా, ఇంకొందరు నంబర్‌ప్లేటు లేని ద్విచక్రవాహనాలపై వస్తూ ఒంటరి మహిళల మెడల్లో చైన్లు తెంపుకుపోతున్నారు.
పోలీసుల సూచనలివే..
●జిల్లాలో ప్రస్తుతం జాతరలు, పండగలు, దేవాలయ ఉత్సవాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శివరాత్రి వరకు ఈ రద్దీ కొనసాగనుంది. భక్తులు అశేష సంఖ్యలో ఫ్రీ బస్సులపై వస్తుండటం, వారిలో మహిళలే అధిక శాతంలో వస్తుండటం ఇదే అదనుగా స్నాచర్లు, చోరులు ఎగబడే అవకాశముంది. భక్తులెవరూ నగలు ధరించి రావడం శ్రేయస్కరం కాదు.
●ఒంటరి మహిళలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు నగలు ధరించకపోవడం ఉత్తమం.
●అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడే వీలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆభరణాలు బ్యాంకుల్లో భద్రపర్చుకోవాలి.
2025లో జరిగిన ఘటనలు..
●జనవరి 18న పొందూరు మండలం మొదలవలస కు చెందిన పూజారి కళావ తి (53) శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో హత్యకు గురైంది. నగల కోసమే హత్య జరిగిందని నిర్ధారించారు.
●మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలిని చంపి బంగారం దోచుకుని పారిపోయాడు.
●జూన్ 1న సోంపేట మండలం పాలవలసకు చెందిన రాజేశ్వరిని ప్రియుడే పీక నులిమి చంపేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని పట్టుకుపోయాడు. జూన్ 9న కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన వృద్ధురాలు దుంపల దాలమ్మను అదే గ్రా మానికి చెందిన బల్లి రాము ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి చంపేసి బంగారు గొలుసుతో పరారయ్యాడు.
●ఆగస్టులో ఆమదాలవలస చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మను సరుబుజ్జిలికి చెందిన నవీన్ గొంతు నులిమి చంపేయడమే కాక 98 గ్రా ముల బంగారం, వెండి, నగదు పట్టుకుపోయాడు.
●అక్టోబరు 27 రాత్రి సారవకోట మండలం బుడితికి చెందిన నక్క చెల్లమ్మ (80) ఇంట్లో నిద్రపోతుండగా ఓ అగంతకుడు చొరబడి ఆమె ముక్కు, చెవులుకున్న బంగారాన్ని తెంపేశాడు.
●డిసెంబరు 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి (64)ని చంపి బంగారం దోచుకెళ్లి బావిలో పడేశారు.
●ఆగస్టు 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకటపార్వతీశం గుప్తాను హత్య చేసి పెద్దపాడు రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు.
బంగారం ధర పెరగడంతో రెచ్చిపోతున్న దొంగలు మహిళలపై పెరుగుతున్న దాడులు చైన్ స్నాచింగ్‌లు పెరిగే అవకాశం జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
ఆకాశయానం చేస్తున్న బంగారం ధర సామాన్యులను భయపెడుతుంటే.. దొంగలను మాత్రం రెచ్చగొడుతోంది. రోజురోజుకూ స్వర్ణం ధర విపరీతంగా పెరుగుతుండడంతో చోరులు హస్త లాఘవం చూపుతున్నారు.
వృద్ధులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులకు కూడా వెరవడం లేదు. ఈ వైఖరి జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీలకు కూడా ఆస్కారం ఉంది. శుక్రవారమే ఏకంగా రెండు చైన్‌స్నాచింగ్‌లు జరగడం ఓ హెచ్చరిక.
శ్రీకాకుళం క్రైమ్ :
1/3
పెంచుతోంది దడ
2/3
పెంచుతోంది దడ
3/3
పెంచుతోంది దడ