ప్రతి వ్యక్తీ బాధ్యతగా వ్యవహరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతి వ్యక్తి తమ హక్కులతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలమన్నారు.చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మానవ హక్కులపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ ఎస్.వెంకటరమణ, లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ జగన్నాథనాయుడు, కృష్ణమోహన్, మజ్జి సుమన్, లక్ష్మణ్, మణిశర్మ, రాష్ట్ర మహిళా మానవ హక్కుల ప్రతినిధి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


