అవినీతికి నిలయంగా వైద్యారోగ్యశాఖ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అవినీతికి నిలయంగా మారిందని, అధికారుల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్రేడ్ 3 ఏఎన్‌ఎం లుగా విధులు నిర్వహిస్తున్న దళిత ఆదివాసి మహిళలకు పదోన్నతలు కల్పించడం లేదన్నారు. అడిక్వసీ పేరుతో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు తుంగలోకి తొక్కేస్తున్నారని విమర్శించారు. 15 శాతం దళితులకు, 6 శాతం ఆదివాసీలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లలో బీసీలకు స్థానం కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, కుల నిర్మూలన పోరాట కమిటీ అధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గురడి అప్పన్న, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు భాస్కరరావు, ఐల కుమారి, జన్ని ఆరుద్ర, పాలక సత్యవతి, హిమరిక సునీత, బిడ్డిక కల్యాణి, భగవతి, రజిని పాల్గొన్నారు
హరిత మహోత్సవంలో కలెక్టర్
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రొడ్డులో నిర్వహిస్తున్న సిక్కోలు హరిత మహోత్సవాన్ని బుధవారం కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. మిలెట్స్‌తో తయారు చేసిన వస్తువుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
సిక్కోలులో మానవ హక్కుల ఉల్లంఘన
జలుమూరు: చంద్రబాబు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో హక్కులను హరిస్తూ పౌరహక్కులకు భంగం కలిగిస్తోందని సామాజిక కార్యకర్త, శ్రీముఖలింగం అర్చకుడు నాయుడు గారి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు అంత ర్జాతీయ మానవ హక్కులు దినోత్సవం సందర్బంగా బుధవారం డిల్లీలో హ్యూమన్ రైట్స్, కేంద్ర సామాజిక న్యాయశాఖమంత్రి రాందాస్ అత్వాలిని కలిసి సమస్య వివరించారు.
అవినీతికి నిలయంగా వైద్యారోగ్యశాఖ


