ఇరుకు దారులతో అవస్థలు
● 9న బాలియాత్ర ముగింపు ఉత్సవం
● తెప్పోత్సవానికి అనువుగా లేని నదీ మార్గాలు
● కరకట్ట దాటాలంటే అవస్థలు
జలుమూరు: శ్రీముఖలింగంలో ఈ నెల తొమ్మిదిన బాలియాత్ర ముగింపు ఉత్సవం జరగనుంది. దీనిపై పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నిర్వాహక కమిటీ కూ డా పలు మార్లు సమావేశాలు నిర్వహించి యాత్ర సజావుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులకు విన్నవించింది. ఇదే సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నా రు. ఇంత వరకూ బాగున్నా భక్తులు ప్రధాన దే వాలయం నుంచి వంశధార నదికి వెళ్లే మార్గం తుప్పలు, బురద మధ్యన ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తులు నదిలో సులువుగా దీపోత్సవం నిర్వహించుకుంటారు.
వేల సంఖ్యలో భక్తులు హాజరు
ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల ఈ బాలి యాత్ర శ్రీముఖలింగంలో గత ఏడాదే ఇక్కడ ప్రారంభమైంది. ఈ ఏడాదికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహక కమిటీ అంచనా వేస్తోంది. నదిలో దీపోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి నదీ మార్గాలు వెడల్పు చేసి శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఈఓ ఏడు కొండలను వివరణ కోరగా నది మార్గాలు పంచాయతీ నిధు లతో చేయడం జరిగిందని ఇంకా చేయాల్సి వస్తే ఆ శాఖ ద్వారా చేస్తామన్నారు.
ఘనంగా బాలియాత్ర ప్రారంభం
ప్రాచీన కళింగ రాజ్య సంప్రదాయమైన బాలి యా త్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీముఖలింగంలో ప్రారంభమైంది. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు,అర్చనలు,అభిషేకాలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ముగింపు ఉత్సవం ఈ నెల 9న పెద్ద ఎత్తున జరగనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు.


