కింజరాపు కుటుంబానికే సూపర్ సిక్స్ నజరానాలు
● మంత్రి అచ్చెన్నాయుడుపై
ధ్వజమెత్తిన పేరాడ తిలక్
టెక్కలి: రాష్ట్రంలో కింజరాపు కుటుంబానికి మాత్ర మే సూపర్ సిక్స్ నజరానాలు దక్కాయని, మంత్రి అచ్చెన్నాయుడు ఉన్మాదిగా మారి మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరా డ తిలక్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం టెక్క లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడా రు. ఒక్క కింజరాపు కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల పదవులతో పాటు అచ్చెన్నాయుడు సొంత అన్న కొడుకు నిమ్మాడ సర్పంచ్ సురేష్‌కు ఉత్తమ పంచాయతీ అవార్డు, మరో అన్న ప్రభాకర్‌కు పదవీ విరమణ మునుపు ప్రమోషన్, ఆ తరువాత విజిలెన్స్ ఓఎస్‌డీ పదవి, ఇప్పుడు ఏకంగా జిల్లా విజిలెన్స్ ఇన్‌చార్జి ఎస్పీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. దీంతో పాటు అచ్చెన్నాయు డు సమీప బంధువు ముద్దాడ రవిచంద్రకు సైతం సీఎంఓలో కీలకమైన బాధ్యతలు కట్టబెట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాకు రూ.86 కోట్ల ఇన్‌పుట్ స బ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చుకోలేని అసమర్థ మంత్రిగా అచ్చెన్న అప్రతిష్ట మూటగట్టుకున్నారని తెలిపారు. మోంథా తుఫాన్‌లో నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు. కల్తీ మద్యం కేసులో సాక్ష్యాలతో పట్టుబడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా ఎవరో చెప్పారని వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో... బహిర్గతం చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు చింతాడ అప్పన్న, కర్నిక జీవన్, బి.రాజేష్ ఉన్నారు.


