తుఫాన్ రేషన్‌లో చేతివాటం..?
● సగం సరుకులే పంపిణీ చేశారని ఆరోపణ
పోలాకి: ఇటీవల మోంథా తుఫాన్‌కు తీర ప్రాంతంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లో డీలర్లు చేతివాటం చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అంపలాం పంచాయతీ నుంచి కొందరు లబ్ధిదారులు పోలాకి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశా రు. అయితే రేషన్‌డీలర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఎలాంటి చర్యలు తీసుకోవ టం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఒకలా, రేషన్ డీలర్ మరోలా చెబుతున్నారు. సివిల్ సప్లై గోడౌన్ నుంచి సరుకులు వచ్చినప్పుడే డ్యామేజీ కావటంతో సగం సరుకులే పంపిణీ చేశామని డీలర్ చెబుతుంటే, అలాంటిదేమీ తమ దృష్టిలోకి రా లేదని అధికారులు చెబుతున్నారు. పంచదార ఇంకా డిపోలకు చేరలేదని, ఒకటి రెండు రోజు ల్లో పూర్తిగా సరుకుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డీటీ రామకృష్ణ అన్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
తుఫాన్ రేషన్ సరుకుల్లో సగ మే పంపిణీ చేసిన విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. నూనె అరకిలో ఇచ్చి దారిలో బస్తా పడిపోయినట్లు డీలర్ చెప్పి తప్పించుకుంటున్నారు.
– కొమర నర్సింహమూర్తి, లబ్ధిదారుడు, రాజారాంపురం
తుఫాన్ రేషన్‌లో చేతివాటం..?


