65 బస్సులు రద్దు
శ్రీకాకుళం అర్బన్ : మోంథా తుఫాను తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బోసిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లేకపోవడంతో నాన్ స్టాప్ కౌంటర్ ఖాళీగా దర్శనమిచ్చింది. వర్షాల ప్రభావం ఆర్టీసీ పై కూడా పడింది. జిల్లాలో శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 19 బస్సులను, శ్రీకాకుళం 2వ డిపో పరిధిలో 18 బస్సులను, టెక్కలి డిపో పరిధిలో 10 బస్సులను, పలాస డిపో పరిధిలో 18 బస్సులను కలిపి మొత్తం 65 ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. వర్షాలు ఉంటే బుధవారం కూడా పలు సర్వీసులు రద్దే చేసే అవకాశం ఉంది.


