విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
పోలాకి: జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలాకి మండలంలో తీరప్రాంత గ్రామమైన గుల్లవానిపేటలో కారి రామచంద్రరావు(37) దీపావళి సందర్భంగా ఇటీవల ఇంటికి సీరియల్‌సెట్ అలంకరించాడు. తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా గాలులు వీస్తున్నందున మంగళవారం సీరియల్ సెట్ తొలగించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
రామచంద్రరావుకు భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇంటికి ఆసుకుని ఉన్న విద్యుత్‌లైన్ తగలడంతోనే ప్రమాదం జరిగిందని, హైటెన్షన్ వైర్లు తొలగించాలని కోరినా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది మాత్రం ఇంటి వద్దే విద్యుత్‌షాక్‌కు గురైనట్లు చెబుతున్నారు. పోలాకి ఎస్‌ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
బొంతలకోడూరులో వీఆర్‌ఏ..
ఎచ్చెర్ల : బొంతలకోడూరు పంచాయతీ వీఆర్‌ఏ బి.నర్సింహులు (45) మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. భవానీ మాల వేసిన ఈయన సన్నిధానానికి విద్యుత్ సరఫరా రాకపోవడంతో జాయింట్ కలిపేందుకు వెళ్లి షాక్‌కు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు.
రామచంద్రరావు(ఫైల్)
నర్సింహులు (ఫైల్)
విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి


