వైద్య, రేషన్ సేవలు నిరంతరాయంగా అందించాలి
పలాస: పలాసలో జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మంగళవారం పలాసలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగిన సలహాలు,సూచనలు చేశారు. వైద్యం, రేషన్ సేవలను నిరంతరాయంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు ఆయా విభాగాలను నిశితంగా పరిశీలించారు. తుఫాన్ సమయంలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింటును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో సిబ్బందితో చక్రధర్‌బాబు


