● వేటకు దూరమై.. తీరానికే పరిమితమై..
సారవకోట: బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ (80) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడితిలో నక్క చెల్లెమ్మ తన ఒంటరి వృద్ధురాలు సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చెవి, ముక్కుకు ఉన్న అరతులం బంగారు వస్తువులు తెంచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప చువ్వతో దాడికి పాల్పడటంతో మెడపై తీవ్ర గాయమైంది. వృద్ధురాలి కేకలు విని స్థానికులు చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అవంతరం బాధితురాలిని బుడితి సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుడితి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
వృద్ధురాలిపై దాడి..బంగారం చోరీ


