‘ఽథర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించాలి’
సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే పోరాటా లు మరింత ఉద్ధృతం చేస్తామని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి స్పష్టం చేశారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, బొమ్మిక, చీదిరివలస, తిమడాం గ్రామాల్లో థర్మల్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ఆదివారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సరుబుజ్జిలి జంక్షన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ దమన కాండకు వ్యతిరేకంగా సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ధర్నాలు, నిరసనలు తెలిపి అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందిస్తామని వెల్లడించారు. రైతుల అనుమతులు లేకుండా పంటపొలాల్లో రాత్రివేళ రహస్య డ్రోన్‌ల తో సర్వేలు చేసి వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. సమావేశంలో పోరాట కమిటీ కార్యదర్శి సింహాచలం, రైతుకూలీసంఘం జిల్లా కా ర్యదర్శి వంకలమాధవరావు, మిన్నారావు, బాబూ రావు, రమేష్,సవరఽ ధర్మారావు పాల్గొన్నారు.


