మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం: తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాటించాలని, మండల విద్యాశాఖాధికారులు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తుఫాన్ సన్నద్ధతపై ఆరా తీశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. 94924 23420, 97018 61629, 63059 58501 నంబర్లకు కాల్ చేయాలని డీఈఓ రవిబాబు సూచించారు.


