ప్రైవేటీకరణతో నష్టం
సంతబొమ్మాళి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ టెక్క లి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని తాళ్లవలస, కాళీపురం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలో పూర్తిగా నిలిపివేశారని అన్నారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బి.మోహనరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కోత సతీష్, నక్క భీమారావు, మార్పు నాగభూషణరావు, మార్పు ఆశోక్ చక్రవర్తి, కె. ఇందిర. కె.కృష్ణారావు, తదితరులు ఉన్నారు.


