నిషా వల..
జలుమూరు మండలం కొమనాపల్లి మద్యం షాప్‌ను ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్ వద్ద పరిస్థితి ఇది. కొమనాపల్లి మద్యం షాప్ జిల్లా మంత్రి సమీప బంధువుది కావడంతో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడకు సమీపంలోనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప ర్మిట్ రూమ్ ఒకటి ఉండగా మరో రెండు పర్మిట్ రూమ్‌లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. – జలుమూరు
రణస్థలం కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఉండే దాబాల్లో మద్యం సేవిస్తున్న దృశ్యమిది. ఇదే మండలంలోని పైడిభీమవరం, వరిసాం, కొత్తపెట్రో ల్ బంకు, తాళ్లవలస గ్రామాల్లోని జాతీయ రహదారి–16కు ఆనుకుని ఉండే దాబాల్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. రణస్థలం ఎకై ్సజ్ సీఐ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. – రణస్థలం
నిషా వల..
నిషా వల..


