వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

Oct 27 2025 7:11 AM | Updated on Oct 27 2025 7:11 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోంథా తుఫాన్‌ నేపథ్యంలో తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 28వ తేదీన వైఎస్సార్‌సీపీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీని నవంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోంథా తుఫాన్‌ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

మహిళ అవయవ దానం

సోంపేట: మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన మహిళ ఉలాల హేమావతి(33) అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన ఉలాల హేమావతి ఈ నెల 22న బుధవారం కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తూ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి గాయపడ్డారు. సోంపేటలోని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం జెమ్స్‌కు తరలించారు. రెండు రోజులుగా చికి త్స పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్లు, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, హృదయం, కాలేయం దానం చేశారు. ఆరుగురికి ఇవి ప్రాణదానం చేయనున్నాయి. హేమావతిది నిరుపేద కుటుంబం. భర్త వెంకటరావు బెంగళూరులో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. హేమావతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన పలువురు ఉలాల హేమావతికి నివాళులు అర్పించారు. ఇంత విషాదంలోనూ అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు.

చదరంగంతో మెదడుకు పదును

టెక్కలి: చదరంగంతో మెదడుకు ఎంతో పదును పెట్టవచ్చునని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు అన్నారు. జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ఆల్ఫాజెన్‌ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్స్‌ చాంపియన్స్‌ ట్రోఫీ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదరంగంపై మక్కువ పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం చిన్నారులతో సహా విద్యార్థులంతా సెల్‌ఫోన్లకు బందీలుగా మారుతున్నారని, దీని వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటోందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా చదరంగం ఆడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా చెస్‌ ఇన్‌ స్కూల్స్‌ కమిటీ సభ్యుడు సనపల భీమారావు, జిల్లా ప్రతినిధి ఐ.అభినాష్‌ తో పాటు ఆల్ఫాజెన్‌ పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

సందడిగా కార్తిక వన భోజనాలు

కవిటి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం కార్తీక వన భోజనాలు, లక్ష్మీనారాయణుల పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు చేసి సామూహిక వనభోజనాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక వికాసంతో పాటు ఐక్యతాభావం పెరుగుతాయన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఏటా ఈ విధంగా ఒక రోజు అంతమంది కలిసి ఒక చోట చేరి పూజలు చేస్తామని కృష్ణారావు మాస్టారు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ర్యాలీ  నవంబర్‌ 4కి వాయిదా 1
1/3

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

వైఎస్సార్‌సీపీ ర్యాలీ  నవంబర్‌ 4కి వాయిదా 2
2/3

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

వైఎస్సార్‌సీపీ ర్యాలీ  నవంబర్‌ 4కి వాయిదా 3
3/3

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement