జలుమూరు: కార్తిక మాసంలో శ్రీముఖలింగం రాలేని భక్తులకు వారి గోత్రనామాలు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఉచితంగా పూజలు నిర్వహిస్తామని అనువంశక అర్చకులు నాయుడుగా రి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జన్మనక్షత్ర, గ్రహదోషాలు పోవడానికి ఉచిత పూజలు చేస్తామని, దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తు లు 9493577098 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయాలని కోరారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నవంబర్ 14న జరి గే బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం క్రాంతిభవన్‌లో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పేరుకు చట్టాలు ఉన్నా యి తప్ప బాలకార్మికుల నియంత్రణ జరగడంలేదన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నా నియంత్రణ కరువైందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్‌లు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును దూరం చేసుకుంటు న్న నేపథ్యంలో రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గిరిబాబు, సురేష్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం రూరల్: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్(21) ఉపాధి కోసం ఏడు నెలలు క్రితం తన అన్నయ్య బన్నీతో కలిసి అబుదాబి వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ అబుదాబిలోని ఎన్‌హెచ్‌ఎస్ కంపెనీ కన్‌స్ట్రక్షన్‌లో స్ట్రాచలర్ ఫిట్టర్‌గా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు తామంతా క్షేమంగా ఉన్నామంటూ తల్లిదండ్రులతో విజయ్ మాట్లాడాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని కన్నీటిపర్యంతంగా వేడుకుంటున్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 6 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ కాలం సేవలందించడం సంతోషంగా ఉందని ఏసీబీ డీఎస్పీ వి.ఎస్.ఎస్.రమణమూర్తి అన్నారు. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి రిలీవ్ అయ్యానన్నారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య శ్రీకాకుళం జిల్లాకు ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీగా కొనసాగనున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు సౌమ్యులని పేర్కొన్నారు, టెక్కలిలో రూ.4 లక్షలతో తహసీల్దారును పట్టుకోవడం, రాజాం కొత్తూరులో అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను పట్టుకోవడం, విజయవాడలో రూ.25 లక్షలతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్‌ను పట్టుకోవడం మర్చిపోలేనివన్నారు. ఎన్నికల సమయంలో సిట్ టీమ్‌లో కీలక సభ్యునిగా ఉన్నానని పేర్కొన్నారు.
రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని కొత్త పెట్రోల్ బంకు సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. ఆటోలో ఎవరూ లేకపోవడం డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ క్యాబిన్‌లో క్లీనర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు గంట సేపు శ్రమించి జేసీబీ సాయంతో లారీని ఎత్తి క్లీనర్‌ను బయటకు తీశారు. ప్రమాద సమయంలో రోడ్డుపైనే వాహనాలు పడిపోవడంతో సుమారు కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది.
● ఏడు నెలలు క్రితం ఉపాధి కోసం అన్నతో పయనం ● సన్యాసిపుట్
● ఏడు నెలలు క్రితం ఉపాధి కోసం అన్నతో పయనం ● సన్యాసిపుట్


