స్కూల్‌గేమ్స్ అథ్లెటిక్స్‌లో పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: స్కూల్‌గేమ్స్ పోటీల్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు శ్రీకాకుళం జిల్లా అథ్లెట్స్. ఏలూరులోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకులం కళాశాల మైదానంలో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన ఏపీ రాష్ట్రస్థా యి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల అథ్లెటి క్స్ చాంపియన్‌షిప్ – 2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు 34 పతకాలు సాధించారు. ఇందులో 14 బంగారు, 8 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి.
బాలబాలికల చాంపియన్స్‌గా మనమే..
ఎస్‌జీఎఫ్ రాష్ట్ర అండర్–19 అథ్లెటిక్స్ పోటీల్లో బాలురుతోపాటు బాలికల రెండు విభాగాల్లోనూ చాంపియన్స్‌గా జిల్లా క్రీడాకారులు కావడం గమనార్హం. వ్యక్తిగత విభాగంలో కె.కృష్ణవేణి చాంపియన్‌గా నిలిచింది. జిల్లా క్రీడాకారుల బృందానికి కోచ్, మేనేజర్లగా ఇ.అప్పన్న, ఎం.నీలంనాయుడు, ఎం.సతీష్, బి.శ్రీనివాసరావు వ్యవహరించారు. క్రీడాకారులు రాణింపు పట్ల ఇంటర్ విద్య డీవీఈఓ ఆర్.సురేష్‌కుమార్, డీఈఓ ఎ.రవిబాబు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, మహిళా సెక్రటరీ ఆర్.స్వాతి, పీఈటీ సంఘ నాయకులు ఎం.వి.రమణ, పి.తవిటయ్య, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, నౌపడ విజయ్‌కుమార్, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డీఎస్‌డీఓ డాక్టర్ శ్రీధర్‌రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు.


