అంధులకు ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అంధుల కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కళ్లద్దాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేఎఫ్‌ఆర్‌సీ ఆర్గనైజేషన్ అఛలా హెల్త్ సర్వీస్ ఆర్థిక సహాయంతో జెమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంధులకు కళ్లద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు ఖరీదుతో కూడుకున్నవి అయినప్పటికీ కేంద్ర రాష్ట్రాల ద్వారా వచ్చే ఫండ్స్ నుంచి కొనుగోలు చేసేలా తక్కువ ధరకు అందించేందుకు సహకరిస్తామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జెమ్స్ ఆసుపత్రి పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. జెమ్స్ ఆస్పత్రి ఫౌండర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడు తూ ఏఐ టెక్నాలజీ కళ్లద్దాల వల్ల అంధులమనే భావన వారిలో తొలగిపోతుందన్నారు. కార్యక్ర మంలో కేఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ డాక్టర్ వి.భుజంగరావు, అఛలా హెల్త్ సర్వీస్ సీఈఓ రాజేష్‌రాజు, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీలలిత, వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


