●భారీ వర్షాలకు అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో జల్లులు పడుతున్నాయి. వీటి ప్రభావం మరో రోజు వరకు ఉంటుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో రాబో యే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ మేర కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అఽధికారులను ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులు అంతా అప్రమత్తంగా ఉండి పంటలను వీలున్నంత సురక్షిత ప్రాంతాలలో భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు. –శ్రీకాకుళం పాతబస్టాండ్


