శ్రీకాకుళం
న్యూస్‌రీల్
పట్టుకెళ్తూ.. పట్టుబడుతూజిల్లా మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోంది. అసలు సూత్రధారులు దొరకడం లేదు. –10లో
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కంచిలి మండలంలో దీపావళి బాంబు పేలింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల నుంచి ముడుపులు తీసుకోవడమే కాకుండా.. ఫిర్యాదులు వెళ్లాయని మందుగుండు సామగ్రి సీజ్ చేశారని పోలీసులపై వ్యాపారులు భగ్గమంటున్నారు. దీనికి సంబంధించి వ్యాపారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడీ ఆడియో సంభాషణలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ ఆడియో సంభాషణల్లో ఉన్న వివరాల ప్రకారం..
షాపునకు రూ.58 వేలు..!
కంచిలి మండలంలో నాలుగు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చారు. కంచిలిలో ఒకటి, అంపురంలో ఒకటి, జాడుపుడిలో రెండు దుకాణాలు ఏర్పాటు చేశారు. కానీ షాపులు నుంచి ముడుపుల విషయంలో ఆ తర్వాత సంప్రదింపులు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కో షాపు నుంచి రూ.70వేలు అడిగినట్టు, ఆ తర్వాత రూ. 58 వేలకు ఒప్పందం కుదిరినట్టు, దాని ప్రకారం షాపుల నుంచి చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో అక్కడ జరిగిన ముడుపుల బాగోతంపై ఓ వ్యక్తి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని ఏ షాపులైతే ముడుపులు ఇచ్చాయో వాటిపైనే తనిఖీలు చేసి, పరిమితికి మించి మందుగుండు సామగ్రి ఉందని, విక్రయించారని చెప్పి పెద్ద ఎత్తున సామగ్రిని సీజ్ చేసినట్టుగా తెలిసింది. దీంతో ఆ వ్యాపారులకు మండింది. ఒకవైపు ముడుపులు తీసుకుని, మరోవైపు సీజ్ చేస్తారా? అని ఓ పోలీసు అధికారి వైఖరిపై ఆవేదనకు లోనయ్యారు. ఇంతలో అధికార పార్టీకి చెందిన ఒక వ్యాపారి దుకాణం వద్ద ఒక పోలీసు అధికారి పెద్ద ఎత్తున హడావుడి చేయడమే కాకుండా వచ్చే కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్నారని స్పాట్‌లోనే ఏకంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు తలంటినట్టుగా వ్యాపారులు చర్చించుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మా వాళ్లను కూడా ఇబ్బంది పెడతారా? అని ఆ ఎమ్మెల్యే సీరియస్ కావడంతో పోలీసులు డిఫెన్స్‌లో పడిపోయారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
శ్రీకాకుళం
శ్రీకాకుళం


